సినీ నటుడు అలీకి మాతృ వియోగం
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, బుల్లి తెర వ్యాఖ్యాత అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ప్రస్తుతం అలీ చిత్రీకరణ నిమిత్తం రాంచీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబద్‌కు హుటాహుటిన బయలు దేరి వస్తున్నారు. మరోవైపు జైతున్ బీబీ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాతృమూర్తిపై ఉన్న ప్రేమను అలీ వివిధ సందర్భాల్లో తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తల్లితండ్రులే కారణమని చెప్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. మరోవైపు ఇప్పటికే అలీ తన తండ్రిపేరిట సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
Comments
Post a Comment