పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం


డిల్లీ : సుదీర్ఘ చర్చానంతరం పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌ సభలో ఆమోదం పొందింది. సుమారు 12 గంటలపాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌ సభలో మొత్తం391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో ల ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన సమయంలో మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్‌ అయినప్పుడు ఈ బిల్లును వివక్షపూరితంగా చెప్పే హక్కు ఆ పార్టీకి లేదని తెలిపారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మరియు ఆఫ్ఘనిస్తాన్‌ నుండి 'మైనారిటీ వలసదారులకు' పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించినందున ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాయి, ముస్లిం సమాజానికి చెందిన వారిని దాని పరిధి నుండి తప్పించి బిల్లు ఆమోదించేదింప చేశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా