ఎపిలో ఇకపై దిశ చట్టం... చారిత్రాత్మక బిల్లుకు ఎపి కేబినేట్ ఆమోదం


 తస్మాత్‌ జాగ్రత్త... ఇక ఏపిలో దిశ యాక్ట్‌... 21రోజుల్లోనే మరణశిక్ష...


అమరావతి (జనహృదయం) : దేశవ్యాప్త సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, సజీవదహనం ఘటనలో నిరసనలు వెల్లువెత్తి నిందితులను ఉరితీయాటంటూ మిన్నంటిన ప్రజాగ్రహంతో పార్లమెంటును కూడా కుదిపేసిన ఈసంఘటనలు పునరావృతం కాకుండా ఎపి ప్రభుత్వం కీలక చట్టం చేసింది. దేశరాజదాని నిర్భయ ఘటనను మించి దిశహత్యోదంతంలో ప్రజా గర్జన పెల్లుభికింది. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వం ఓ అడుగు ముందుకుసి దేశంలోనే తొలిసారి దిశ యాక్ట్‌కి రూపకల్పన చేసింది. మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నూతన చట్టానికి ఏపీ దిశ యాక్ట్‌ గా నామకరణం చేశారు.



ఈమేరకు భారత శిక్షాస్మతిలోని సెక్షన్‌ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్‌ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. రెడ్‌ హ్యాండెడ్‌ గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలలో సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగులు పెట్టినా సెక్షన్‌ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు.


సోషల్‌ మీడియాలో మహళలపై అసభ్య పోస్టింగులకూ...


మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారికూడా అదే విధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడనుంది. పోక్సో ఎన్‌ కౌంటర్‌ మ తదేహాల చట్టం కింద మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ శిక్ష విదిస్తున్న విషయం తెలిసిందే. ఆ శిక్షను కూడా పెంచుతూ ఈ బిల్లులో అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా