రాజధాని ప్రకటనతో ఉత్తరాంధ్రలో హర్షం
గుడివాడ అమర్నాథ్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే
ఆయన మాటల్లోనే...
తాడేపల్లి ముఖ్యమంత్రి ప్రకటనను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో మల్టీబుల్ రాజధానులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర లో సీఎం ప్రకటన తో పండగ వాతావరణం నెలకొంది..
రాయలసీమను జ్యుడీషియల్ క్యాపిటల్ చేస్తామన్న సీఎం ప్రకటనతో రాయలసీమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కింద స్థాయి వరకు అందాలని ఎలా భవిస్తామో పరిపాలన కూడా అదేవిధంగా అందాలని సీఎం భావిస్తున్నారు. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద కుంభకోణం.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు. గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు.13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారు. రాజధానిలో ఎకరాకు 2 వేలు ఖర్చు చెసిన లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది..
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే 1400 మంది అభిప్రాయం తీసుకొని రాజదాన్ని నిర్మిస్తారా, రాజదాన్ని అభివృద్ధి చేస్తే రాజధానిలో ఎందుకు లోకేష్ ఓడిపోయాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతి పారిపోయి వచ్చారు. చంద్రబాబు రాజధాని ప్రాతంలో కనీసం ఇల్లు కూడా నిర్మించుకోలేదు.
చంద్రబాబు, ఆయన బినామిలు పెద్ద ఎత్తున భూములు కొన్నారు కాబట్టి అమరావతి రాజధాని అంటున్నారు. మరావతి ఉంటే చాలు మిగతా ప్రాంతాలు అవసరం లేదన్న విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారు. అంతర్జాతీయ రాజధాని అని చెప్పి ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. ఐదు వేల కోట్లలో వెయ్యి కోట్లు కన్సల్టెంట్స్ కు ఖర్చు చేశారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు పరిస్థితి ఏమిటి. టీడీపీ నేతలు బినామిలు పేరుతో వేల ఎకరాలు కొన్నారు..
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఒకరే నడుపుతున్నట్లు ఉంది. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు పెళ్ళాలు ఉంటే తప్పులేదు కానీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పా. రాయలసీమ వెళ్లి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైజాగ్ కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలన రాజధానికి 300 ఎకరాలు ఉంటే సరిపోతుంది..
చంద్రబాబు దత్త పుత్రుడు గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు గిఫ్ట్ గా పరిపాలన రాజధాని ప్రకటనని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు.
ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పార్టీలను ముసుకోవాలి. పవన్ కళ్యాణ్ మాటలకు నిలకడ లేదు. ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతాడు.
పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు టీడీపీ నేతలు రాజధానిలో భూములు కొన్నారు కాబట్టి వైజాగ్ లో వైస్సార్సీపీ నేతలు భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Comments
Post a Comment