రాష్ట్రంలో తుగ్లక్ పాలన...
అమరావతి : ఒక రాష్ట్రం, మూడు రాజధానులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనమని టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జగన్ ఈ ప్రకటన చేశారన్నారు. కర్నూలులో హైకోర్టు ఉద్యమం చేయించింది జగనేనన్నారు. రాజధాని మారుస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని నక్కా ఆనందబాబు నిలదీశారు.
Comments
Post a Comment