సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్

హైదరాబాద్ : సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యింది. నవంబర్‌లో ఓఆర్‌ఆర్ మీద అతి వేగంతో ప్రయాణించి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. సైబరాబాద్ పోలీసులు అతని కారు నంబర్ పై స్పీడ్ లేజర్ గన్‌లు చిత్రీకరించిన దృశ్యాలను చూడగా.. దాదాపు 22 సార్లు అతి వేగంతో ప్రయాణించాడని స్పష్టమైంది. ఇలా తరచుగా అతివేగంతో ప్రయాణించడాన్ని పరిశీలించిన పోలీసులు.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని ఆర్‌టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. దీంట్లో భాగంగా ఆర్‌టీఏ అధికారులు లైసెన్స్‌ను పరిశీలించగా.. 2017 లోనే అతని డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని తేలింది. దీంతో ఆర్‌టీఏ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా