ఏపీలో మీ సేవలు బంద్



అమరావతి:  మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో తమ ఉపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవా ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు రాష్ట్ర మీసేవా ఆపరేటర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె యుగంధర్‌, ఎస్‌ భానుమూర్తి గురువారం వెల్లడించారు.


రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ఆపరేటర్లు, 35వేలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని వారు తెలిపారు. ప్రభుత్వ చర్యల వలన 40వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని అన్నారు.  ఇటీవల గ్రామసచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం సచివాలయ పరిధిలోనే మీసేవా తరహా డిజిటల్‌ సేవలందించేందుకు చర్యలు ప్రారంభించింది. తాజాగా దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో మీసేవా ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా