పోలీసులను కలవరపెడుతున్న దిశ ఎన్కౌంటర్..


లోతుగా సాగుతున్న ఎన్‌కౌంటర్‌ విచారణ...


పోలీసుల మెడచుట్టూ బిగుస్తున్న ఉచ్చు?



మరిన్ని ఆధారాలకోసం హైకోర్ట్ కీలక ఆదేశాలు...


నిందితుల మృతదేహాలకు సోమవారం రీపోస్టుమార్టం....


హైదరాబాద్‌ (జనహృదయం): దిశ ఘటనలో ఎన్‌కౌంటర్‌ అనంతరం జరుగుతున్న పరిణామాలు రోజుకోమలుపుతిరుగుతూ ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఎన్‌కైంటర్‌ లో పోలీసులు సీన్‌ రీ క్రియేషన్‌ చేస్తున్న తరుణంలో నిందితులు తిరగబడి ఎదురుదాడి చేసి పారిపోయే ప్రయత్నంలో పోలీసుల తుపాకులు లాక్కొని కాల్పులు జరిపిన దానికి ప్రతిగా ఆత్మరక్షణకై జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని పోలీసుల వాదన, అయితే ఆ నలుగురుని కావాలనే తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేశారని కుటుంబ సభ్యులు, కొందరి న్యాయవాదుల ఆరోపణ. ఈనేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదోపవాదాలు, విచారణలు జరిగాయి. దీంతో 17రోజులపాటు మృతదేహాలకు అంత్యక్రియలు కూడా జరగలేదు. అత్యంత వ్యయంతో మృతదేహాలను భద్రపరుస్తున్నారు. అయితే ఇక మృతదేహాల భద్రత సాధ్యం కాదని ఇప్పటికే 50శాతం పైగా డీకంపోజ్‌ అయ్యాయని వైద్యాధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసి వాస్తవ పరిస్థితులు కనుమరుగవకుండా సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణకు ఆటంకం కలుగకుండా విదించిన నిబందనలు ఎన్‌కౌంటర్‌ పోలీసుల మెడకు ఉచ్చులా పరిగణిస్తున్నాయి.



సీనియర్‌ నిపుణులైన ఎయిమ్స్‌ బోర్డు సభ్యులతో రీపోస్టుమార్టం....


దిశ ఘటనా స్థలంలో జరిగిన దిశఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ఇబ్బందిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం స ష్టించిన దిశ ఘటనతోపాటు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ఇరకాటంలో పడేిస్తున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణలు ఓ ఎత్తయితే జాతీయ మానవహక్కుల నివేదిక, రాష్ట్రంలో సిట్‌ దర్యాప్తు, మరి కొన్ని రోజుల్లో త్రిసభ్య కమిటీ విచారణ ఇవి చాలవన్నట్లు తాజాగా రీపోస్ట్‌మార్టం, అందులో విధించిన షరతులు కలకలంగా మారుతున్నాయి. హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌ మార్చురీలో భద్రపరిచిన దిశ నిందితుల మ తదేహాలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులతో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు శనివారం ఆదేశించింది. దీనికోసం ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులలో అత్యంత సీనియర్లయిన ముగ్గురు సభ్యులతో మెడికల్‌ బోర్డు ఏర్పాటుచేయాలని సూచించింది. ఈమేరకు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేత త్వంలోని ధర్మాసనం.. కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు సభ్యులను విమానంలో తీసుకువచ్చి, సాధ్యమైనంత త్వరగా మ తదేహాలకు రీపోస్ట్‌మార్టంచేయాలని ఆదేశించింది. ఇప్పటికే మ తదేహాలు 50 శాతం డీకంపోజ్‌ అయ్యాయని కోర్టులో గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ వెల్లడిండంతో సమయం ఎక్కువగా లేదని, ఈ నెల 23 సాయంత్రం 5 గంటలలోపు రీపోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేసింది. రీపోస్ట్‌మార్టం అనంతరం మెడికల్‌ బోర్డు సేకరించిన ఆధారాల ప్రకారం స్వతంత్రంగా ముగింపు అభిప్రాయాన్ని వెల్లడించాలని తెలిపింది.రీపోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియో రికార్డుచేసి ఆ ఫుటేజితోపాటు పోస్ట్‌మార్టం రిపోర్డులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సమర్పించాలని పేర్కొంది.


దిశ ఘటన, ఎన్‌కౌంటర్‌ వరకు ఇంచ్‌ టు ఇంచ్‌ రికార్డు అప్పగించాలి....


ఈ ఘటనలో కేస్‌ డైరీ, లాగ్‌బుక్స్‌, వెపన్‌ ఎంట్రీలు, దిశ హత్యాచారం ఘటన నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగే వరకు పోలీసుల కదలికల వివరాల రిపోర్ట్‌లు కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాల్‌ రికార్డులు, నిందితులను తీసుకెళ్లిన పోలీస్‌స్టేషన్‌ సీసీ టీవీ ఫుటేజి, సెల్‌టవర్‌ లొకేషన్‌ వివరాలను కూడా సేకరించాలని సిట్‌ను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను సీజ్‌చేయాలని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బ ందాన్ని ఆదేశించింది. అలాగే వాటిని సమగ్ర పరిశీలన కోసం సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపాలని తెలిపింది. ఇతర ఆధారాలను సేకరించి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆధారాలతో పోలీసులు ఇరకాటంలో పడటం ఖాయమనే చర్చ జోరందుకొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జేజేలు కొట్టించుకున్న పోలీసుల్లో అంతర్మధనం అలుముకొంది. అయితే ఇప్పటికే ఈ ఘటనలో ఈమేరకు ఆధారాలను పోలీసులు సేకరించి సిద్దం చేసి దిశ నిందితులు నేర చరిత్ర సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా