మన్యంలో డ్రోన్ కెమెరా లతో పటిష్టమైన నిఘా ..
పాడేరు (జనహృదయం) : విశాఖ మన్యంలో డోన్ కామేరలతోను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లతో పోలీస్ విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టుల పి ఎల్ జి ఏ వారోత్సవాల ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పటిష్ట భద్రతా చర్యలు తీసుకొంటున్నారు. వారోత్సవాల కు ముందునుంచే అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసు బలగాలకు అదనంగా గా 13 ప్రత్యేక పోలీసు బృందాలను పంపి సరి హద్దుల్లో జల్లెడ పడుతున్నారు. డ్రోన్ కెమెరా సహాయంతో మావోయిస్ట్ ల కదలికలను అంచనావేస్తున్నారు. మన్యంలో మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు జి.మాడుగుల పెద్ద బాయలు సరిహద్దు గ్రామాలలో ఆదివారం పోస్టర్లు అతికించారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీఎనిలో బాగంగా ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గత అనుభవాలతో ముందస్తు చర్యల్లో పోలీసు యంత్రాంగం నిమగ్నమయింది. మావోయిస్టుల దాడులను తిప్పికొట్టేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మారుమూల ప్రాంతాలలో సాంకేతిక ను వినియోగించుకుంటూ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరా ఉపయోగించి కొండ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
Comments
Post a Comment