సిఎం పుట్టినరోజు కానుకగా భీమిలికే....
భీమిలి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భీమిలీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపి విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖకు చెందిన భీమిలికి మహర్దశ పట్టనుందని, పరిపాలన రాజధాని భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయనున్నారని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. 'పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలనుకున్నాం. దీనికి చంద్రబాబు అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివ ద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విశాఖలో పరిపాలన రాజధాని నిర్మించాలని జగన్ సంకల్పించారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజధాని ఇక్కడకు తరలించడం వల్ల భీమిలి నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందనిఆయన అన్నారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి రాజధాని రావడం సంతోషకరం' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం నిర్ణయాన్ని భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ స్వాగతించారు.
Comments
Post a Comment