గిరిజన హక్కులు కాపాడాలి...


పాడేరు (జనహృదయం) : గిరిజన,ఆదివాసీలహక్కులను, చట్టాలను అవహేలన చేస్తుా పాడేరుకు చెందిన గిరిజనేతరుడైనరొబ్బి శంకర్ రావు అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేవిదముగా పిటీషన్ దాఖలుచేయడాన్ని నిరశిస్తుా సోమవారం గిరిజన ఐక్యకార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో నక్కలపుట్టు పెట్రోల్ బంకు నుండి క్రిందిబజారు, అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటిడిఏ వరకు బారీ ర్యాలీ నిర్వహించరు. గిరిజనేతరుడైన బానిస రొబ్బి శంకర్ రావు పై ఎస్ సి, ఎస్ టీ, అట్రాసిటీ కేసు నమెాదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనేతరుల అక్రమకట్టడాలను కుాల్చివేయాలని ,గిరిజన చట్టాలను గౌరవించని గిరిజనేతరులంతా మన్యప్రాంతం విడిచి తక్షణమే మైదాన ప్రాంతాలకు తరలివెల్లాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఐటీడీఏ వద్ద జరిగిన మానవహరంలో గిరిజన సమాఖ్య జిల్లా సహయ కార్యదర్శి కుాడ రాధాక్రిష్ణ మాట్లాడుతూ ..గిరిజన ప్రాంతంలో బ్రతుకుతెరువుకోసం వలసవచ్చిన గిరిజనేతర వ్యక్తి అయిన రొబ్బి శంకర్ రావు అనే వ్యక్తి గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడం, దానికి మిగిలిన గిరిజనేతరులు మద్దత్తు ప్రకటించడం ఎంత దైర్యమని ప్రశ్నించారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 చట్టం అమలులో ఉండగా గురిజనేతరుడైన వ్యక్తి 3 అంతస్తుల అక్రమకట్టడం ఎలా కట్టగలిగాడని అన్నారు. తక్షణమే అతని అక్రమకట్టడం కుాల్చివేయాలని డిమాండ్ చేసారు. ఈ విషయమై ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య మండల నాయకులు పి. రత్నం, మెాహనరావు, ఆదివాసి హక్కులవేధిక నాయకులు కుాడ సుబ్రహ్మణ్యం, శంకర్,టి. రాము , గిరిజన పాత్రికేయ సంఘం, నాయకులు అరుణ్, శేఖర్, రమణ, సుార్య, సునీల్, రాజారావు, మహేష్ బాబు, న్యాయవాదుల సంఘం నాయకులు టి. ప్రసాద్ నాయుడు, శంకర్ రావు మరియు కే. ఈశ్వర్ రావు మాస్టర్లు విద్యార్ది సంఘం నాయకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గోన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా