జయహో తెలంగాణా పోలీస్....జస్టిస్ ఫర్ దిశ కేసులో ప్రజాభిప్రాయానికే విజయం
హైదరాబాద్ (జనహృదయం): జయహో తెలంగాణా పోలీస్....జస్టిస్ ఫర్ దిశ కేసులో ప్రజాభిప్రాయానికే విజయం వరించింది. . అంటూ యావత్ భారతావని హర్షాతిరేకాలు వ్యక్తం అవుతునన్నాయి. ఈఘటన బాహ్యప్రపంచానికి చేరిన మరుక్షణం నుంచి తెలంగాణా పోలీసులకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. పోలీస్ జిందాబాద్ అంటూ ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది. దిశ సంఘటనో పోలీసులు సీన్ రాక్రియేషన్ లో బాగంగా శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని నిందుతులను బ్రిడ్జి క్రిందకు ఏవిదంగా వెళ్లారో చూపించమని పోలీసులు కోరగా కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని పొరిపోయేందుకు ప్రయత్నించగా ఆత్మరక్షణలో బాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో దిశ నిందుతులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్న కేశవ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.
మృగాలుగా ప్రవర్తించినందుకే....
క్షణికానందానికి దిశను పథకం ప్రకారం లాక్కుపోయి పాశవికంగా అత్యాచారం, సజీవ దహనానికి పాల్పడి తమ కామ వాంఛతీర్చుకొని మానవ మృగాలుగా ప్రవర్తించిన నలుగురు నిందుతులు ప్రదేశంలో పోలీస్ తూటాలకు బలయ్యారు. దీంతో ఎవరైనా ఇటువంటి దారుణాలకు పాల్పడితే ఇదే గతి పడుతుందన్న సంకేతాన్ని తెలంగాణ పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా సిపి సజ్జనార్ దోరణి యావత్ భారతావని తలెత్తుకునే విదంగా చేసింది. తెలంగాణా పోలీసులు తీసుకున్న నిర్ణయం పలు రాష్ట్రాల పోలీసులకు దిశానిర్ధేశం చేసినట్లయింది. ఈ ఎన్‌కౌంటర్ మహిళా లోకానికి స్పష్టమైన రక్షణ భరోసా కల్పించేందుకు ఈ ఎన్‌కౌంటర్ దోహదపడుతోంది.
అదే ప్రాంతం అదే సమయం... 10 రోజులే తేడా... దిశ సజీవదహనం అయిన స్థలంలోనే...
దిశ ఘటనలో పోలీసులు ఆది నుంచి ఎన్నొ వ్యయప్రయాసలకు గురయ్యారు. దిశ నిందుతులను కోర్టుకు తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో వైద్యుడు, జడ్జిలను పోలీస్ స్టేషన్‌కే రప్పించి వైద్య పరీక్షలు చేయడం, రిమాండ్ విధించడం జరిగింది. చివరకు వారిని చర్లపల్లి జైలుకు తరలించడం కూడా పోలీసులకు పెద్ద సాహసంగా పరిగణించింది. వేలాది మంది ప్రజలు నిందితులను వెంటనే ఉరితీయాలని లేదా కాల్చి చంపాలని పెద్ద ఎత్తున ప్రజా గర్జన నెలకొంది. ఈనేపథ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా త్వరితగతిన కేసు విచారణ జరిగి నిందితులకు శిక్ష పడే విదంగా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ వచ్చారు. దీనిలో బాగంగా శుక్రవారం తెల్లవారు జామున సీన్ రీక్రియేషన్ చేయడంలో బాగంగా నిందుతులు ఎదురుతిరగడంతో ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఎక్కడైతే దిశ నరకయాతన అనుభవించి ఆర్తనాదాలు చేసిందో అదే చోట అదే పరిస్థితుల్లో నిందితుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాకపోతే కేవలం 10రోజులే తేడా... గత పదిరోజుల క్రితం దిశ సజీవదహనం.. నేడు దానికి కారణమైన నలుగురు ఎన్‌కౌంటర్....తో మహిళా లోకానికి తెలంగాణా పోలీస్ భరోసా కల్పించినట్లయింది.
Comments
Post a Comment