పోలీసు యాక్షన్ కు సలాం కొట్టిన జనం .....
నర్సీపట్నం (జనహృదయం) : షాద్‌నగర్ దిశ ఘటనలో పోలీసులు తిరుగుబాటు చేసిన నిందుతులను ఎన్‌కౌంటర్ చేసిన నేపధ్యంలో పోలీసు చర్చను సమర్థిస్తూ ఎపిలో భారీ ర్యాలీలు జరిపి పండుగ చేసుకొంటూ పోలీసులకు జెజేలు పలికారు. పోలీసు అన్నా నీకు సలాం అంటూ కొనియాడారు. ఈమేరకు నర్సీపట్నంలో వివిద పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పట్నం లో భారీ ర్యాలీ నిర్వహించారు. జైజై ద్వానాలతో పోలీసులను కొనియాడారు. ఇటువంటి సంఘనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణా దిశ నిందితుల ఎన్ కౌంటర్ మానవ మృగాలుగా మారుతున్న వారికి స్పష్టమైన హెచ్చరికగా చరిత్రలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పోలీసులు ప్రజాభీష్టం మేరకు సమ సమాజం కోసం తీసుకునే చర్యలను ప్రజలంతా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. దీనిలో బాగంగా దిశ ఘటనలో పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించి ఎన్‌కౌంటర్ చేయడంపై తామంతా పోలీసు చర్యను సమర్థిస్తున్నామంటూ నినదించారు. ఇదే విదంగా విశాపట్నం, విజయవాడ తోపాటు రాష్రం నలుమూల పోలీసు చర్యను కొనియాడుతూ సలాం కొట్టారు.
Comments
Post a Comment