ఫలించిన పోలీస్ ప్లాన్ ..... ప్రశాంతంగా ముగిసిన వారోత్సవాలు ...


చింతపల్లి (జనహృదయం) : ఏఓబిలో గత వారం రోజులుగా తలపెట్టిన మావోయిస్టు పిఎల్‌జిఎ వార్సోవాలు ప్రశాతంగా ముగిశాయి. ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు శతవిధాలా ప్రయత్నించినా వారికి తావులేకుండా చేసేందుకు పోలీసులు అలుపెరగని పోరాటం చేయవలసి వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనివిదంగా గతంలో జరిగిన అనుభవాల దృష్య్టా ఈ ఏడాది పోలీసులకు పెద్ద సవాలే ఎదురైంది. వారంరోజులపాటు తలపెట్టిన మావోయిస్టు వారోత్సవాల్లో ఎక్కడా వారి జాడ కూడా కనిపించకుండా చేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విజయవంతం అయ్యింది.



క్షణమొక యుగంగా.... ఏడు రోజులూ... 


 ఏక్షణంలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ క్షణ క్షణం భయం భయంగా గడిచినా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. మారుమూల గ్రామాల్లో సైతం పోలీసు హవా నడిచింది. గత ఏడాది మావోయిస్టులు పాడేరు పోలీస్‌ సబ్‌డివిజన్‌లో డుంబ్రిగుడ గ్రామానికి అతి సమీపంలో అప్పటి తాజా మాజీ శాసన సభ్యులను హత్య చేసి రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించారు.



పోలీసులు సాహసమే చేశారు... 


 ఈ అనుభవంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్‌ కెమారాలను వాడుతూ మావోయిస్టుల సంచారాన్ని పసిగట్టారు. ఎక్కడి కక్కడ గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జాగిలాల సహయంతో మారుమూల కల్వర్టులు సైతం తనిఖీచేశారు. మండల కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాల్లో కొత్తవారి వివరాలు సేకరిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఏజన్సీకి వచ్చిపోయే వాహనాలన్నీ క్షణ్ణంగా పరిశీలించారు. ఈ పరిణామాలు ప్రజలకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతంలో మావోయిస్టు చర్యలను అడ్డుకోవడమే ద్యేయంగా ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఓవిదంగా చెప్పాలంటే ఈ ఏడాది మావోయిస్టు వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సివచ్చిందని చెప్పక తప్పదు.



మావోయిస్టులకు వ్యతిరేకంగా మన్యంలో పెల్లుభికిన నిరసన జ్వాలలు...  


 ఇదంతా ఓ ఏత్తయితే గిరిజనుల మద్దతు కూడగట్టి పోలీసు యంత్రాంగం మరో ముందడుగు వేసింది. గతంలో ఎన్నడూ లేని విదంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా యువతరాన్ని కూడగట్టింది. గతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిలవాలంటే ప్రాణం గాల్లో కలిసినట్టే అనే ధోరణి ఉండగా ప్రస్తుతం ఆపరిస్థితులు లేవనే చెప్పాలి.  ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకూ ఈ ఏడు రోజులు గిరిజన ప్రాంతాల్లో వారోత్సవాలు వద్దు... గిరిజన అభవృద్దే ముద్దు.. అంటూ విద్యార్థిలోకం నినదించడం శుభపరిణామం.. ఈదిశగా మార్పు తీసుకురావడంలో పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా