ప్లాష్‌...ప్లాష్‌... దిశ నిందితులకు రీపోస్టుమార్టం...


అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌....


సోమవారం బందువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు....


హైదరాబద్‌ : రోజుకో మలుపుతిరుగుతూ దేశవ్యాప్త సంచలనం సృష్టించిన దిశకేసు వ్యవహారంలో నిందితుల మృతదేహాల అంత్యక్రియలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గత 16రోజులుగా మృతదేహాలు అప్పగించాలని బందువులు ఓవైపు రోధిస్తుండగా, మరోవైపు అవి కుళ్లిపోతున్నాయని పోలీసులు, వైధ్యులు కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు సుప్రీం కోర్టు కమీషన్‌ వేసిన నేపథ్యంలో మృతదేహాలు అంత్యక్రియలకు బ్రేక్‌పడింది. దీంతో వాటిని భద్రపరచడం అధికార యంత్రాంగానికి సాహసంగా మారింది. మళ్లీ రీపోస్టు మార్టం అవకాశాలు ఉన్నందున మృతదేహాల భద్రత కష్టసాధ్యంగా మారింది.


ఈ నేపథ్యంలో దిశ నిందితుల మ తదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మ తదేహాల విషయంలో శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణకు సంబంధం లేని అధికారులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మృతదేహాల రీపోస్టుమార్టం సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ డాక్టర్లపై తమకు నమ్మకం లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో ఈమేరకు కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఇండిపెండెండ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టాలని రీ పోస్టు మార్టం మొత్తాన్ని వీడియో తీయాలని అధికారుల్ని ఆదేశించింది. పోస్టుమార్టం తర్వాత మ తదేహాల్ని పోలీసుల సమక్షంలో నిందితుల కుటుంబాలకు అప్పగించాలని కోేర్టు తెలిపింది.


దిశపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నేరానికి నలుగురు నిందితుల్ని ఈ నెల 6వతేదీన చటాన్‌ పల్లి వద్ద పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 16 రోజులు గడుతన్నా ఇప్పటివరకు నిందితుల మ తదేహాలకు అంత్య క్రియలు మాత్రం జరగలేదు. ఎన్‌ కౌంటర్‌ పై హైకోర్టు, సుప్రీం కోర్టుల విచారణ జరుగుతుండటంతో నలుగురు మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో వేలాది రూపాయల వ్యయంతో భద్రపరిస్తూ వచ్చారు. అయితే మ తదేహాల భద్రత విషయంలో కోర్టు విచారణకు శనివారం గాంధీ ఆస్పత్రి సూపరెండెంట్‌ శ్రావణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు మ తదేహాలు 50 శాతం డీకంపోజ్‌ అయ్యాయని మరో వారంలో మొత్తం కుళ్లిపోతాయని కోర్టుకు ఆయన తెలియజేశారు. ఈమేరకు కోర్టు మృతదేహాల రీపోస్టుమార్టం కోసం ఆదేశాలిస్తూ అనంతరం వాటిని బందువులకు అప్పగించాలని పేర్కొంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా