మహిళా భద్రతకై జగన్ నర్కార్ కీలక నిర్ణయం...
అత్యాచార నిందితులకు ఇక మరణశిక్షే..
అమరావతి (జనహృదయం) : సమాజంలో రోజురోజుకూ పెరిగుతున్న అత్యాచారాలు, హత్యలు నివారించి మహిళా భద్రతకు... జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు చకచకా పావులు కదుపుతోంది. నేటి నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీలో మహిళలపై మృగాలుగా ప్రవర్తించేవారికి ఇక నుంచి మూడువారాల్లోపు మరణ శిక్ష అమలు జరిగే విదంగా కొత్తచట్టాలు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు సిఎం జగన్‌మోహన్ రెడ్డి అదికారులను ఆదేశించారు.
నేరం జరిగిన మూడు వారాల్లోనే శిక్ష.....
అసెంబ్లీ ఈ సమావేశాల్లో కీలకమైన చట్టం తీసుకురావడం ద్వారా ఇక నుంచి మహిళల పై అత్యాచారాలకు పాల్పడిడే నిందితులకు మరణ శిక్ష విధించేలా సర్కార్ కొత్త చట్టం తెస్తుంది. అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణ 3 వారాల్లోనే పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకునేలా చట్టం చేయనున్నారు. కేవలం ఈ కేసుల విచారణ కోసం జిల్లా జడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైతే మరో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళల భద్రతలో ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదంటూ మహిళలకు భరోసా కల్పించేందుకు జగన్ సర్కార్ కొత్త చట్టాలు అమలు శ్రీకారం చుడుతున్నారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం పై కూడా ఒత్తిడి తెచ్చి కఠిన చట్టాలు అమలు చేసేవిదంగా సమాయత్తం అవుతున్నారు.
Comments
Post a Comment