పదవ తరగతి ఉత్తీర్ణత లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి


జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్


విశాఖపట్నం : రానున్న 10వ తరగతి పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు.  మంగళవారం వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో నిర్వహించిన  ప్రధానోపాధ్యాయుల వార్షిక ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దాలని, 100 రోజుల ప్రణాళిక ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందన్నారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలన్నారు. ముఖ్యంగా గణితంలోని మెళుకువలను తెలిపినట్లయితే భయం లేకుండా విజ్ఞాన శాస్త్రాల పై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. పాత ప్రశ్నపత్రాలను ఆకళింపు చేసుకుంటూ చిన్న చిన్న పరీక్షలను నిర్వహించాలన్నారు. విద్యార్థులు మెరుగైన ఆరోగ్యంతో ఉండే విధంగా పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విధంగా తర్ఫీదు ఇవ్వాలి అన్నారు. పదవ తరగతిలో 10 కి 10 మార్కులు పొందే విద్యార్థులను గుర్తించి వారికి మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. వారికి సామాన్య పరిజ్ఞానం కల్పిస్తూ వివిధ అంశాలను బోధిం చాలన్నారు. అన్ని సబ్జెక్టుల లోను విద్యార్థులందరినీ ప్రారంభం నుండి తీర్చిదిద్దుతూ ఉండాలని, వారి ఇబ్బందులకు తగినట్లుగా బోధన ఉండాలన్నారు. విద్యార్థుల ప్రవర్తన పట్ల ఉపాధ్యాయులు, వార్డెన్లు అప్రమత్తత గా ఉండి క్రమశిక్షణ తప్పిన వారిని తగినవిధంగా శిక్షించాలి అన్నారు.


        అధికారులు పాఠశాల హాస్టళ్లను తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలని, తమ దృష్టికి వచ్చిన లోటుపాట్ల పై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులను వసతి గృహాలకు రాత్రిపూట పంపించి విద్యార్థులకు ఇష్టమైన విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. పబ్లిక్ పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు ప్రత్యేకమైన నోట్స్ లను అందజేయాలన్నారు. అమ్మవడి, నాడు నేడు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ క్లాస్ రూమ్స్, గ్రంథాలయ పఠనం, ఆటలు, మొక్కల పెంపకం మొదలైన అంశాలలో కూడా విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.


ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ కె. దానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జున రెడ్డి, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా