భద్రాదిలో బెంగళూరు వాసి హత్య...
కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు
భద్రాచలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తెలంగాణలోని భద్రాచలంలోని గోదావరి నదీ తీరంలో హత్యకు గురైన వ్య క్తిని బెంగుళూరు వాసిగా పోలీసు అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి గోదావరి నదీ తీరంలో హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం రాత్రి పోలీసులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో భద్రాచలం పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో ఆధార్ వేలిముద్ర నమోదుతో హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరించారు. ఆ వివరాల ప్రకారం అతడి పేరు అశ్వత్థామయ్యగా గుర్తించారు.
కర్ణాటక రాష్ట్రంలోని నార్త్ బెంగుళూరు కుండలహల్లి గేట్ సమీపంలోని గుల్మోహర్ ఎన్‌క్లేవ్ రోడ్డులో ఉన్న 301 ఎఎన్‌ఎ్‌స హోమ్స్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భద్రాచలం సీఐ వినోద్‌రెడ్డి కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని వివిధ పు ణ్యక్షేత్రాలను సందర్శించే అలవాటు ఉన్న అశ్వత్థామయ్య ఈ క్రమంలోనే భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతడిని ఎ వరు హత్య చేశారు. ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Post a Comment