వ్యభిచార ముఠా గుట్టురట్టు...
వాట్సాప్‌లలో బిజినెస్ డీల్...
చిత్తూరు : పట్టణంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు చాకచక్యంగా విటుల మాదిరిగా వ్యవహరించి ఈ వ్యవహారం వెలికితీశారు. చిత్తూరు మరకంబట్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం అందిన పిర్యాదు మేరకు వలపన్నారు. మగ పోలీసులు విటులుగా వెళితే, వారికి అండగా మఫ్టీలో ఆడ పోలీసులు వెళ్లి అసలు వ్యవహారాన్ని బయట పెట్టారు. నలుగురు యువతులను, ఓ విటుడిని పట్టుకున్నారు. మరకంబట్టు కేంద్రంగా ఓ మహిళ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతోంది. చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను డబ్బు ఆశచూపి ఈ కూపంలోకి లాగేది. వీరి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి, ధర కూడా ఉంచేది. ఈ విధంగా యువతిని బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధర నిర్ణయించేది. అలా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. స్థానికంగా ఉన్న ఈ యువతులను కళాశాల విద్యార్థులు అనుకుని చాలా రోజులు స్థానికులు పట్టిం చుకోలేదు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి వీరి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు వల వేసి ముఠా గుట్టు రట్టు చేశారు.
Comments
Post a Comment