రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
విశాఖపట్నం : కంచరపాలెం బ్రిడ్జి కింద రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కాకినాడ పాసింజర్ రైలు రైల్వే స్టేషన్ లోకి అవుటర్ నుండి ప్లాట్ ఫామ్ కు వస్తుండగా రైలు పట్టాలపై నడుస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు రైల్వే పోలీసులు మృతి మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించిన కేసు నమోదు చేశారు
Comments
Post a Comment