ఉపాధి దిశగా విద్యాభోదన సాగాలి ....సిఎం జగన్
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీకి రూ.50 కోట్ల అర్ధిక సహాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.విశాఖనగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం2019 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం నాడు నేడు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని ప్రక్షాళన పాఠశాలల నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు. పాఠశాలల్లో కావాల్సిన కనీస సౌకర్యాలు, మౌళిక వసతులను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా దీవెన అనే పథకం ద్వారా విద్యార్ధులకు చదువుకునేందుకు ప్రభుత్వం అండగా నిలబడనుందని అన్నారు. ప్రతి కోర్సును జాబ్ ఓరియండెడ్ గా ఉండేలా విద్యాలయాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర ఏయూది. ఆంధ్రాయూనివర్శిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈ యూనివర్శిటీలో దాదాపు 459 టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసిందని, ఈ విషయంలో ప్రభుత్వం పరంగా తలదించుకోవాల్సిందేనని జగన్ అభిప్రాయపడ్డారు.
Comments
Post a Comment