ఫ్లాష్..... ఫ్లాష్.... దిశ నిందితుల ఎన్కౌంటర్ లో....


పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...


ఎన్‌కౌంటర్‌ చట్టవిరుద్దమంటూ సుప్రీంలో పిర్యాదు...


కేసునమోదు చేసి దర్యాప్తు చేయనున్న మానవ హక్కుల కమీషన్‌...



హైదరాబాద్‌ (జనహృదయం): దేశవ్యాప్తంగా సంచలనం స ష్టించిన దిశ నిందితుల ఎన్‌ కౌంటర్‌ వ్యవహారం జనం హర్షించి పోలీసులు సాహసచర్యను ఆకాశానికెత్తి హారతులిచ్చారు. అయితే ఈ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లుగా పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈమేరకు హైకోర్టు నలుగురు నిందితుల అంత్య క్రియలకు తాక్కాలికంగా బ్రేక్‌ వేయడంతోపాటు ఎన్‌కౌంటరర్‌ ఘటన తాజాగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ ఎన్‌ కౌంటర్‌ లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిపై ఎఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఎన్‌కౌంటర్‌పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు దిశగా...


మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమీషన్‌ (ఎన్‌హెస్‌ఆర్సీ) ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీనిలో బాగంగా ఎన్‌ హెస్‌ఆర్సీ బ ందం హైదరాబాద్‌ చేరుకొని చటానపల్లిలో ఘటనాస్థలాన్ని పరిశీలించి రిపోర్ట్‌ ఇవ్వనుంది. మరోవైపు తెలంగాణ పోలీసులు దిశ నిందితులపై జరిపిన ఎన్‌ కౌంటర్‌ ను బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం శిక్షించకుండా అన్యాయంగా కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఉన్నత, అత్యున్న న్యాయస్థానాల జోక్కంతో ఈ వ్యవహరం ఆసక్తికరంగా మారింది. వేలాది మంది ప్రజలు ప్రజాప్రతినిదులు పోలీసులకు మద్దతుగా నిలువగా చట్టాన్ని ఎవరూ అతిక్రమించరాదనే నింబదన మేరకు కొంతమందిలో ఈ ఎన్‌కౌంటర్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


సీన్‌ రీక్రియేషన్‌ పగటిపూట చేస్తే ప్రజాగ్రహాన్ని పోలీసులు కంట్రోల్‌ చేయగలరా?


నిందితులను పగలు తీసుకొచ్చి సీన్‌ రీక్రయేషన్‌ దర్యాప్తు చేపడితే వారికి పోలీసులు రక్షణ కల్పించే పరిస్థితులు లేని కారణంగా తెల్లవారు జామున ఎవరికీ తెలియకుండా ఘటనా స్థలానికి వెళ్లినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా నిందుతులను తొలుత రిమాండ్‌కు తీసుకువెళ్లడమే పోలీసులకు పెద్ద సవాలుగా మారిన తరుణంలో వారిని బయటకు తీసుకువచ్చి విచారణ జరిపే సాహసం చేస్తే ప్రజాగ్రహానికి నలుగురు నిందితులు బలయ్యేవారు. ఈపరిణామం దృష్ట్యా పోలీసులు తెల్లవారుజామున సీన్‌రీక్రియేషన్‌ దర్యాప్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది.



నిందితులు తిరుగుబాటుచేసే అవకాశం లేదా?


అయితే నిర్మానుష్య ప్రాంతం దిశ సజీవదహనంలో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లేసరికి నిందితుల్లో దైర్యం వచ్చి పోలీసులపై తిరుగుబాటు చేశారా? పారిపోయేందుక సాహసించి ప్రాణాలు కోల్పోయారా? అక్కడ జరిగిన నిందితులు తిరుగుబాటులో ఎస్సైతోపాటు మరొకరికి గాయాలు అవడం వారు ఆసుపత్రిలో చికిత్సపొందడం ఈ ఎన్‌కౌంటర్‌కి అద్దం పడుతున్నాయి. అయితే ఈపరిణామం ఎటుదారితీస్తుందోనన్న ఆశక్తి నెలకొంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా