జార్కండ్ ఎన్నికలలో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
రాంచీ : ఉత్కంఠభరితంగా సాగిన జార్కండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. పాలక బీజేపీపై జేఎంఎం- కాంగ్రెస్ కూటమి విస్పష్ట ఆధిక్యం కనబరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జేఎంఎం కాంగ్రెస్ కూటమి 42 స్థానాల్లో ముందంజలో ఉండగా పాలక బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఏజేఎస్ యూ 3 స్థానాల్లో, పోల్స్ జేవీఎం 3 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలు కలిగిన జార?ంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 41కాగా జేఎంఎం కాంగ్రెస్ కూటమి కీలక సంఖ్యను దాటే దిశగా సాగుతోంది. మరోవైపు ఆధిక్యాల్లో దోబూచులాటతో ఇరు పక్షాలు చిన్నాచితకా అసెంబ్లీ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్ పూర్ తూర్పు స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ తొలుత ఆధిక్యంలో దూసుకుపోగా ఇప్పుడు ఓ స్థానంలో వెనుకపడ్డారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యత కనబరుస్తుందన్న అంచనాలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలుత బీజేపీ పలు స్థానాల్లో ఆధిక్యం కనబరిచినా జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దీటైన పోటీ ఇస్తూ పాలక బీజేపీ పై విస్పష్ట ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
Comments
Post a Comment