లారీ బోల్తా..... స్థంభించిన ట్రాఫిక్...
అనకాపల్లి (జనహృదయం): విశాఖ జిల్లా తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి ట్రాఫిక్ స్థంభించిపోయింది. చేపల లోడుతో విశాఖపట్నం వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి తాళ్లపాలెం సమీపంలో బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న చేపల తొట్టెలు రోడ్డుపై పడి చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. లారీలో ఉన్న చేపల తొట్డెలు ప్రక్కవస్తున్న మరో కారుపై పడి కారు వెనుకబాగం ద్వంసం అయ్యింది. కాగా రోడ్డుపై పడిన చేపలు ఆమార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తాళ్లపాలెం గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి ఏరుకొన్నారు. దీంతో గందరగోళం నెలకొంది. లారీలో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడగా పెద్దలారీ కావడం రోడ్డుకు అడ్డంగా పడడంతో మద్యహ్నాం నుంచి ఈ ప్రాంతంలో రాకపోకలు స్థంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ పునరుద్దరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
Comments
Post a Comment