శభాష్ సజ్జనార్....దేశంలో తొలిసారి పోలీసు చర్యను ఆకాశానికెత్తిన జనం..
హైదరాబాద్ (జనహృదయం): దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి పార్లమెంటును కుదిపేసిన దిశ ఘటన కొలిక్కిచేరింది. దిశ నిందితులు బ్రతికి ఉండేందుకు అర్హత లేదంటూ వారి తల్లిదండ్రులు మొదలుకొని యావత్ భారతావని ఉరితీయాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని లేదా తమకు అప్పగించాలంటూ ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని గర్జించింది. ఈనేపథ్యంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తూ కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం పాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు 45 రోజుల్లోపే శిక్ష పడుతుందని భావించింది. దీనికోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో దిశ ఘటనలో సీన్ టు సీన్ రీక్రియేషన్ చేస్తూ ఆదారాలు సేకరిస్తున్న పోలీసులకు నిందుతుల నుంచి తిరుగుబాటు ఎదురవడంతో వారిని ఎన్‌కౌంటర్ చేశారు.
ఇదిలా ఉంటూ ప్రస్తుత సిపి సజ్జనార్ వరంగల్ జిల్లాలో ఎస్‌పిగా పనిచేసిన కాలంలో ఓ మహిళపై యాసడ్ దాడి చేసిన నిందుతుడు కూడా అక్కడ ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ప్రస్తుతం దేశవ్యాప్త సంచలనం రేకెత్తించి పోలీసులకు సవాలుగా నిలిచిన దిశ ఘటన నిందితులు 10 రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో నలుగురు ఎన్‌కౌంటర్ జరిగింది. సిపి సజ్జనార్ నాయకత్వంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల తిరిగుబాటుకు తగిన గుణపాఠం చెప్పారు. దీంతో మహిళలపై ఇటువంటి సంఘటనలకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ పరోక్షంగా తెలంగాణ పోలీసులు హెచ్చరించినట్టయింది. అయితే నాడు వరంగల్ లోను నేడు షాద్ నగర్‌లోను జరిగిన రెండు సంఘటనల్లో నిందుతులు మానవ మృగాలుగా వ్యవహరించిన తీరు యావత్ దేశాన్ని కుదిపేసింది. ఇటువంటి సంఘటనల్లో సిపి సజ్జనార్ నాయకత్వంలో వరంగల్, షాద్‌నగర్‌లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లు ప్రజాభీష్టానికి అనుగుణంగాను, ప్రజామోదయోగ్యంగాను, భారతావని గర్హించదగిన విదంగా జస్టిస్ ఫర్ దిశకు న్యాయం చేకూర్చిపెట్టింది. యాదృచ్చికమో యాంత్రికమో ప్రశ్నించి వాటి గూర్చి ఆలోచించేకంటే కేవలం 10 రోజుల్లోనే మానవమృగాల ఎన్‌కౌంటర్ భవిష్యత్ తరాలకు హెచ్చరిక గా నిలిచింది. ఈ మేరకు సంచలనాత్మకంగా దేశాన్ని కుదిపేసిన దిశ కేసు అదే తరహలో సంచలనాత్మకంగా ముగిసి కేసుకు నాయకత్వం వహించిన సిపి సజ్జనార్ శభాష్ అనిపించుకున్నారు.
Comments
Post a Comment