ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్...దిశ కేసులో
హైదరాబాద్ : దిశ కేసులో విచారణ జరిపి నిందితులను శిక్షించేదుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ కసరత్తు ప్రారంభించింది. మహబూబ్ నగర్, షాద్ నగర్ కోర్టులలో ఒక దానిని ఫాస్ట్ట్రాక్ కోర్టుగా చేసి విచారణ చేపడుతారనే అంశంపై ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడనుంది. ఇక మరోవైపు దిశ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆధారాల సేకరణలో నిమగ్నయ్యారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని బలమైన ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టి వారికి ఉరి శిక్ష విధించేలా చార్జీషీట్ రూపొందిస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే చెప్పిన విషయం విదితమే.
షాద్నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఇలాంటి మానవ మృగాళ్ల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే దిశ ని హత్య చేసిన ఆ నలుగురిని వెంటనే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. నిందుతులకి ఉరి శిక్ష అమలు చేసి మరోసారి ఎక్కడా ఇలాంటి ఘాతుకాలకి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో ప్రజలు ఘర్జిస్తున్నారు.
Comments
Post a Comment