మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ...
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. దీంతో రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని గ్రామస్తులు సైతం ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు.
Comments
Post a Comment