మహిళా భద్రకు భరోసా...దిశ నిందితుల ఎన్కౌంటర్


హైదరాబద్‌ (జనహృదయం) : షాద్‌నగర్‌ లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్త సంచలనం రేకెత్తించింది. డిల్లీలో జరిగిన నిర్భయ ఘటన కంటే తీవ్ర స్థాయిలో దేశం అంతటా ప్రజాగ్రహం పెల్లుబికింది. నిందితులను ఉరితీయాలంటూ ఆకాశం దద్దరిల్లేంతగా నినదించి గర్జించింది. మహిళా కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు రక్షించలేవా? మహిళా స్వేచ్ఛ నీటిమూటలేనా? అనే ప్రశ్నతో పార్లమెంటును సైతం కుదిపేసింది. గత తొమ్మిది రోజులుగా దేశంలో అన్ని వర్గాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తి నిందితుల ఉరికోసం డిమాండ్‌ చేస్తూ ముందుకు సాగారు. చివరికి నిందితులను ఉంచిన చెరశాలను కూడా ముట్టడించే దిశగా యత్నం చేశారు. వారు దొరికితే కొట్టి చంపేందుకు వేలాది మంది యత్నాంచారు. చివరికి వారిని జైలుకు తరలించే సమయంలో పోలీసు వాహనాలపై రాళ్లు వేసి తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయిన జనంతో పూల వర్షం కురిపించుకున్నారు తెలంగాణా పోలీస్‌లు.


శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ వార్త దావానంలో వినిపిస్తూ వేలాది మందిని సంఘటనా స్థలానిక చేర్చడంతో పాటు జైజై ద్వానాలతో పోలీసులతో పోలీసులను కొనియాడారు. దేశం అంతటా డప్పులుకొట్టి నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆనందోత్సాహల్లో తేలియాడుతున్నారు.


దీనికి కారణం నిందితుల ఎన్‌కౌంటర్‌ మాత్రమేనని చెప్పక తప్పదు. సమ సమాజంలో మహిళకు రక్షణ కల్పించడంతోపాటు వారిలో మనోధైర్యం నింపేందుకు ఈ ఎన్‌కౌంటర్‌ దోహదపడింది. స్త్రీమూర్తిలో మాతృత్వాన్ని గుర్తుచేసుకోలేని మానవ మృగాలకు ఇది గట్టి గుణపాఠంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇక మహిళలపై కన్నెత్తాలంటే భయం.. ఒంటరిగా కనిపించే మహిళల పట్ల చెడు ఆలోచన ఇలా మానవ మృగాల ధోరణికి చరమగీతం పాడారు తెలంగాణా పోలీసులు... ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజల కంటే మహిళాలోకం తలెత్తుకునే విదంగా వారిలో మనోధైర్యం, ఆత్మస్థైర్యం నింపుతూ మహిళా భద్రకు భరోసా కల్పిస్తూ జస్టిస్‌ ఫర్‌ దిశమరువరాని లోకాల్లోకి పయనమయింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా