రేపటి నుంచి మీసేవ నిర్వాహకుల నిరవధిక సమ్మె
ఏపీలో మీసేవ నిర్వాహకులు అంతా రేపటినుండి బంద్ పాటించేందుకు సిద్ధమయ్యారు .తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత కొంత కాలంగా ఆందోళన చెందుతున్న విషయం విదితమే ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాటిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిర్వాహకులు అంతా ఆందోళనకు దిగుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మీసేవ నిర్వాహకుులు అంతా సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిందిి.
రాష్ట్ర సంఘం అన్ని జిల్లాల నాయకులతో సంప్రదించిన మీదట మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్వాహకుల భావోద్వేగాలను అనుసరించి 20 వ తేది నుండి అనగా శుక్రవారం నుండి సమ్మె చేయుటకు నిర్ణయించి సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. నిర్వాహకులందరూ ఐకమత్యంతో సమ్మెలో పాల్గొని మన కోర్కెలను సాధించుకునేందుకు రాష్ట్ర సంఘానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
Comments
Post a Comment