జర్నలిస్టుల సమస్యలపై జీరో అవర్లో చర్చిస్తా.. ఎమ్మెల్యే అమర్నాద్


అనకాపల్లి  (జనహృదయం) : జర్నలిస్టుల సమస్యలపై జీరో అవర్లో చర్చిస్తానని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ హామీ ఇచ్చారు. శుక్రవారం  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన  సర్వసభ్య సమావేశం  ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమాని కితమ  ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. వీలైనంత త్వరలో ఇళ్ల స్థలాలను కూడా అందించేందుకు జగన్ కృషి చేస్తున్నారన్నారు. త్వరలో ఇళ్ల స్థలాలను కూడా అందించేందుకు జగన్ కృషి చేస్తున్నారన్నారు. 


ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరావు, ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై పలు నిబంధనలు విధించడం ద్వారా వీరికి వచ్చే సంక్షేమ పథకాల్లో కోత విధించాలని ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల ముందు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారితో సమానంగా జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయి తే 2020లో ఉగాదికి బీపీఎల్ లో ఉన్న వారందరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.  జర్నలిస్టుల విషయంలో మాత్రం ఇంత వరకు ఒక కొలిక్కి రాలేద న్నారు. దీనిని బట్టి ఉగా దికే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారన్న విషయం సందిగ్ధంలో ఉందన్నారు. అన్ని వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సిం  జర్నలిస్టుల విషయంలో వివక్ష చూపడం తగదన్నారు. అలాగే యూనియన్ల మధ్య చిచ్చుపెట్టి జర్నలిస్టు లకు అన్యా యం అన్యాయం చేస్తే ప్రభుత్వంపై ఆందోళనకు కార్యాచరణ రూపొంది స్తామన్నారు. రాష్ట్ర కార్య దర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఐక్యంగా పనిచేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చునని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే అమర్నాధ్ అసెంబ్లీలో జీరో అవర్లో గాని, వ్యక్తిగతంగా గాని మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ నాథ్ ను, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరావు, ఆంజనేయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షులు నారాయణ, బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ, పాత్రుడు, శ్రీనివాస్, ఆనంద్, సాంబశివరావు, గౌరవ అధ్యక్షులు జి.కాంతారావు, జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా