వసతి గృహంలో కలెక్టర్ నిద్ర.....
యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టండి... కలెక్టర్ ఆదేశం..
భీమునిపట్నం (జనహృదయం): వసతి గృహాల్లో మౌళిక వసతులకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు కలెక్టర్ బీమిలి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శనివారం రాత్రి బసచేశారు. ఈ సంధర్భంగా వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులు ఉపయోగించేందుకు అనువగా మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని సోషల్ వెల్ఫేర్ డిడిని ఆదేశించారు. జిల్లాలో వసతి గృహాల్లో మౌళిక వసతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. వసతి గృహం చుట్టూ తిరిగి పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వారి బాగోగులు, వసతి, బోజన సదుపాయాలు, విద్యాబ్యాసం జరుగుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి తగు విదంగా ఆదేశాలిచ్చారు. తదుపరి అదే వసతి గృహంలో విద్యార్థులతోపాటు బసచేశారు. కలెక్టరుతోపాటు ఇతర అధికారులు వసతి గృహం సిబ్బంది ఉన్నారు.
Comments
Post a Comment