శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వస్తున్నారు. హకీంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈనెల 20 నుంచి 28 వరకు ఆయన పర్యటన ఉంటుంది. రాష్ట్రపతి 22న రాజ్ భవన్ లో రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ను ఆవిష్కరిస్తారు. 23న పుదుచ్చేరి యూనివర్సిటీ యాన్యువల్ కాన్వొకేషన్ లో పాల్గొంటారు. 25న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శిస్తారు. 27న రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు విందు ఇస్తారు. 28న తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
Comments
Post a Comment