ఏపీలో కొత్త జిల్లాల్లో పరిపాలనకు రంగం సిద్ధం
26 జిల్లాలకు ఐఏఎస్ ఐపీఎస్ లను నియమించిన ప్రభుత్వం
(రాజన్ -జనహృదయం)
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల పరిపాలనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపటి నుండి ఇరవై ఆరు జిల్లాల్లో పరిపాలన కొనసాగించేందుకు జిల్లాల వారీగా అధికారుల నియామకాలు పూర్తి చేశారు. ఏప్రిల్ 4 న 9:05 నుంచి 9:45 నిమిషాల మధ్య కొత్త జిల్లాలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే 26 జిల్లాలకు కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలకు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలను నియమించింది. అలాగే 47 రెవెన్యూ డివిజన్లకు ఆర్డివోలను నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 26 జిల్లాలలో 48 మంది అడిషనల్ ఎస్పీ లను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మాదిరిగా కొత్త జిల్లాల కేంద్రాల నుండి పరిపాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు కొత్త జిల్లాలకు కేటాయించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు రాష్ట్రంలో 26 క్రొత్త జిల్లాలలో కలెక్టర్ ఎస్పీలు పరిపాలన కొనసాగించనున్నారు.
Comments
Post a Comment